అనర్హత కేసు విచారణలో యెడియూరప్ప ఆడియోక్లిప్‌లు

yeddyurappa
yeddyurappa

న్యూఢిల్లీ: కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇపుడుయెడియూరప్ప చేసినవ్యాఖ్యలుగా తాజాగా వెలుగులోనికి వచ్చిన ఆడియోక్లిప్‌ను పరిగణనలోనికితీసుకుంటున్నది. 17 మంది రెబెల్‌కాంగ్రెస్‌జెడిఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి యెడియూరప్ప చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచనలం కలిగించిన సంగతి తెలిసిందే. ముగ్గురుసభ్యులునన బెంచ్‌కు జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఆడియోక్లిప్‌ను కూడా ఆయన పర్యవేక్షిస్తున్న బెంచ్‌ దృష్టికి వచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలను రికార్డులోనికి తీసుకుంటామా లేదా అన్నది బెంచ్‌ స్పష్టంచేయలేదు. సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆడియోక్లిప్‌ వ్యవహారం తమదృష్టికి సైతం వచ్చిందని, ఎమ్మెల్యేలు అనర్హత వేటును సవాల్‌చేస్తూ దాఖలుచేసినఅభ్యర్థనల విచారణలో ఈ ఆడియోక్లిప్‌ విచారణకు వస్తుందా లేదా అన్నది అనవసరమని పేర్కనట్లు సమాచారం. పార్టీ నాయకుల్లో వెల్లువెత్తిన ఆందోళనల నేపథ్యంలో యెడియూరప్ప అసలు జరిగిన వ్యవహారంపై వారికి వివరణ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/