వైసీపీ DSC ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు గురువారం సాయంత్రం పదవి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు తొలి సంతకాలు చేసారు. మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. మొత్తం 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. 6 వేల 731 ఎస్జీటీ పోస్టులు, 132 పీఈటీ పోస్టులు, 7 వేల 725 స్కూల్ అసిస్టెంట్‌ పోస్టులు, 17 వందల 81 టీజీటీ పోస్టులు, 286 పీజీటీ పోస్టులు, 52 ప్రధానోపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేలా తొలి సంతకం చేశారు.

ఇక వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని ఏపీ నూతన ప్రభుత్వం రద్దు చేయబోతుంది. 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.