బిజెపికి వైసీపీ మద్దతు..

స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమికి ససేమిరా అనడంతో తొలిసారి లోక్ సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దించగా.. సీనియర్ ఎంపీ సురేష్‌ను ఇండియా కూటమి పోటీలో నిలిపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు షూరు చేశాయి. ఇందులో భాగంగానే లోక్ సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు.

ఈ మేరకు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేయాలని వైసీపీ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు తెలపడం ఏపీతో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీని ఓడించి అధికారం చేపట్టింది. అయినప్పటికీ జగన్ బిజెపి కి మద్దతు తెలుపడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.