చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన రోజా

ycp mla roja
mla roja

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై ఎపీ అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో రైతు భరోసా పథకంపై వాడివేడిగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాట్లాడుతూ..చంద్రబాబు మెదడు చితికి పోయిందని అన్నారు. చంద్రబాబు తన కుమారుడు విదేశాలకు వెళ్లి చదువుకున్నాడని గొప్పలు చేప్పుకుంటారు కానీ ఆయన కుమారుడు నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్‌ ఒక రాష్ట్రామా? ఒక దేశమా? అన్నది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. తమ పుత్ర రత్నం లోకేష్‌కు వర్ధంతికి, జయంతికి తేడా కూడా తెలీయదని అన్నారు. మంగళగిరిని మందలగిరి అని అన్నాడని చంద్రబాబు మందబుద్ది ఉన్న కొడుకును కన్నారని తీవ్రంగా విమర్శలు చేశారు. ఇంకా చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా అని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజంకాదా అంటూ రోజా దుయ్యబట్టారు. రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర రాక రైతులు నలిగిపోయిన పరిస్థితులు తెలియదా అంటూ చందబ్రాబును సభాముఖంగా నిలదీశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/