పవన్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోశయ్య పాల్గొనడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. సెప్టెంబర్ 2 న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు . ఈ సందర్భాంగా అభిమానులు , రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పాల్గొనడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ నెల 2న అభిమానులు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పాల్గొని జనసేన నాయకులతో కలిసి అన్నం వడ్డించారు. ఇందులో పెదకాకాని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమయ్యాయి.