వైసీపీ ఆ పనిచేస్తే సంఘీభావం తెలుపుతానంటున్న పవన్

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఆదివారం ఉదయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన పవన్.. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు కదలాలని జనసేన అధినేత అన్నారు. దీనికి ముందుగా.. చట్టసభల్లో బలమున్న వైకాపా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను నేను ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని అన్న పవన్.. అధికార పార్టీకీ అల్టిమేటం ఇవ్వలేను అన్నారు. ప్రజలే ఆ పని చేయాలని కోరారు. ఓట్లు వేయించుకున్న వైకాపాకు స్టీల్‌ ప్లాంట్‌ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. వైకాపా నేతలను ప్రజలు నిలదీయాలని కోరారు.

వైసీపీ కి పాద‌యాత్ర లు చేసే అల‌వాటు ఉంద‌ని.. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటు కు వ్య‌తిరేకం గా పాద‌యాత్ర చేయాల‌ని జ‌న సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పాదయాత్ర చేస్తే తానే మొదటగా సంఘీభావం తెలుపుతానని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటు ప‌రం గా కాకుండా ఉండాలంటే వైసీపీనే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టిన పవన్.. తొలుత తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, మరో 12మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. అనంతరం.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగించారు.