‘మా’ ఎన్నికల ఫై వైసీపీ సర్కార్ కీలక ప్రకటన

‘మా’ ఎన్నికలు చిత్రసీమలో రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాజకీయ నేతలు ఎలాగైతే ఒకరి ఫై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటారో..అలాగే ఇప్పుడు మా ఎన్నికల అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటలు వదులుతున్నారు. ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదు..అలాంటి వాడికి ఎలా ఓట్లు వేస్తారని విష్ణు ప్యానల్ సభ్యులు అంటుంటే..నాకన్నా ఎక్కువ తెలుగు మాట్లాడేవాడు విష్ణు ప్యానల్ లో ఉన్నారా..అని ప్రకాష్ రాజ్ ప్రశ్నింస్తున్నాడు. అలాగే మా ఎన్నికల్లో జగన్‌, కేసీఆర్‌, బీజేపీని లాగడం పట్ల కూడా ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మా కు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం అన్నారు. ఇలా ‘మా’ లో మాటల యుద్ధం నడుస్తుంటే..మా ఎన్నికల పట్ల వైసీపీ సర్కార్ కీలక ప్రకటన తెలియజేసింది.

“మా” అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని ఏపీ సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి గానీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదు అని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. ఈ ఎన్నికలలో మేం ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్నీ సమర్థించడం లేదు అని మంత్రి స్పష్టం చేసారు.