రానున్న‘యాస్’ గండం

బంగాళాఖాతంలో అల్పపీడనం

YASS Cyclone
YASS Cyclone

ఈనెల 23వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. ఈ తుఫానుకు ‘యాస్’ అనే పేరుపెట్టారు . ఈ అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.. యాస్ తుఫాను ఈనెల 26 నుంచి 27 మధ్య వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా-బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా, ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్టే తుఫాన్’ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/