యశోద ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్న స్టార్ హీరోస్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం యశోద. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్లో భాగంగా రేపు గురువారం (ఈ నెల 27) సాయంత్రం 5:36 గంటలకి ఐదుగురు స్టార్ హీరోస్ విడుదల చేయబోతున్నారు.

తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళ్‌లో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నట్లు యశోద టీమ్ ప్రకటించింది. ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.