గర్భిణీగా సమంత ఆకట్టుకుంది
సమంత గర్భిణీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమె నటిస్తున్న తాజా చిత్రం యశోద. సమంత ప్రధాన పాత్రలోహరి-హరీష్ లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను ఈరోజు (సెప్టెంబర్ 9న) రిలీజ్ చేసారు.యశోద అనే గర్భిణీ స్త్రీ పాత్రలో సమంత ను పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభం అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ చెప్తుండగా.. దానికి పూర్తి భిన్నంగా ఆమె లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
యశోద చుట్టూ ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లు.. ఆమె బిడ్డకు జన్మనివ్వడకుండా ఎవరో అడ్డుకోడానికి ట్రై చేస్తున్నట్లు టీజర్ లో చూపించారు. వారి నుంచి తనని తాను కాపాడుకోడానికి ఆమె శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్ – ఎమోషనల్ షాట్స్ తో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా థ్రిల్ కు గురి చేసేలా సాగింది. గర్భిణీ లేడీగా సమంత ఎప్పటిలాగే అసాధారణమైన నటన కనబరిచింది. ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించాడు.
ఇక ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ – రావు రమేష్ – మురళీ శర్మ – కల్పిక గణేష్ – సంపత్ రాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. కానీ టీజర్ లో మాత్రం ఎవర్ని చూపించలేదు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.