సక్సెస్ జోష్ లో యశోద టీం

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం యశోద. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్రవారం ( నవంబర్ 11న ) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు , అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెపుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ టాక్ ఇస్తుండడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.
సినిమాకు పాజిటివ్ టాక్ రావడం పట్ల సమంత ట్వీట్ చేసింది. ‘అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేసింది సమంత. గతంలో కంటే ఈసారి సినిమాను ప్రమోట్ చేయడంలో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. యశోద సినిమాపై, నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల పట్ల ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికీ సదా కృతజ్ఞతలు. మీరంతా నా కుటుంబం. మీరు నిజంగా నా సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు..’అంటూ ట్వీట్ చేసింది. ఇదే తరుణంలో ఓటిటి రైట్స్ ను అమెజాన్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.అంటే మరికొన్ని రోజుల్లో యశోద ఓటీటీలో కూడా సందడి చేయనుందన్నమాట. ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందించారు . శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ మూవీలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.