యశోద మూవీ టాక్ ఎలా ఉందంటే..

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం యశోద. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈరోజు ( నవంబర్ 11న ) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు , అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

ఈ సినిమా రేప్ మర్డర్ మిస్టరీతో ప్రారంభం అవుతుందట. అలానే సమంత ఎంట్రీ కూడా చాలా సింపుల్‌గా చూపించినట్లు నెటిజన్లు చెప్తున్నారు. సరోగసీ ఆసుపత్రిలో ఓ మర్డర్ ఇన్విస్టిగేషన్‌తో సినిమా మలుపు తిరుగుతుందని సినిమా చూసిన వారు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు మూవీకి హైలైట్‌ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా థ్రిల్లర్‌గా మారిందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించగా.. బీజీఎం సూపర్‌గా ఉందని సినిమాకి అదే హైలైట్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి పూర్తి రివ్యూస్ వస్తే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది.

శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటించారు.