ఆసక్తి రేపుతున్న యశోద ఫస్ట్ లుక్ గ్లింప్స్‌

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యశోద తాలూకా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ ను మేకర్స్ గురువారం విడుదల చేసారు. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ గా సామ్..రీసెంట్ గా ‘క‌తు వాకుల రెండు కాద‌ల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఇక తెలుగు విషయానికి వస్తే..మూడు సినిమాల‌లో న‌టిస్తుంది. అందులో ‘య‌శోద’ ఒక‌టి. గ‌తేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

కాగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోయేసరికి అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ‘య‌శోద’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసి ఆసక్తి రేపారు. ఈ వీడియోలో సమంత ఓ ఆసుపత్రిలో బెడ్ పై నుంచి సడన్ గా పైకి లేచి.. తనని తాను ఆశ్చర్యంగా చూసుకుంటోంది. ఆమె చేతికి ఏదో బ్యాండ్ ఉండటాన్ని గమనిస్తుంది. తను ఎక్కడ ఉందనే విషయం ఆమెకు తెలియడం లేదు. ఆ ప్రదేశమంతా ఆమెకు కొత్తగా కనిపిస్తోంది.

అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్లి బయట ఉన్న ఒక పావురాన్ని అందుకునే ప్రయత్నం చేసింది సామ్. కానీ వెంటనే ఆమెను ఓ ఊహాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్లు ఈ గ్లిమ్స్ లో చూపించారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా.. ఆకర్షణీయమైన విజువల్స్ మరియు థ్రిల్ కు గురి చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడిన ‘యశోద’ ఫస్ట్ గ్లిమ్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇది సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ అని సూచిస్తోంది.

ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది.

YouTube video