రేపు యశోద నుండి ఫస్ట్ గింప్స్ రాబోతుంది

సమంత ప్రధాన పాత్రలో హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న చిత్రం యశోద. విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ గా సామ్..రీసెంట్ గా ‘క‌తు వాకుల రెండు కాద‌ల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఇక తెలుగు విషయానికి వస్తే..మూడు సినిమాల‌లో న‌టిస్తుంది. అందులో ‘య‌శోద’ ఒక‌టి. గ‌తేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

కాగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోయేసరికి అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ‘య‌శోద’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మే5 ఉద‌యం 11.07 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది.