యశోద మూడు రోజుల కలెక్షన్స్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశోద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు , అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెపుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ టాక్ ఇస్తుండడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే..ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి రోజు రూ. 2.94 కోట్లు.. రెండో రోజున రూ. 2.82 కోట్లు వ‌చ్చాయి.. ఇక మూడో రోజున రూ. 2.61 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అంటే మొత్తంగా రూ. 8.37 కోట్లు షేర్ వ‌చ్చింది. ఇక గ్రాస్ లెక్క‌ల్లో చూస్తే రూ.17.80 కోట్లు అని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాలు సైతం ఢీలా ప‌డుతున్న ఇప్ప‌ట్లో య‌శోద‌కు మాత్రం ఇలాంటి క‌లెక్ష‌న్స్ రావ‌టం మార్కెట్ వ‌ర్గాలు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.

మూడో రోజు షేర్‌ క‌లెక్ష‌న్స్‌ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ. 93 ల‌క్ష‌లు

సీడెడ్ – రూ. 10 ల‌క్ష‌లు

ఉత్త‌రాంధ్ర – రూ. 16 ల‌క్ష‌లు

ఈస్ట్ – రూ. 8 ల‌క్ష‌లు

వెస్ట్ – రూ. 5 ల‌క్ష‌లు

గుంటూరు – రూ. 10 ల‌క్ష‌లు

కృష్ణా – రూ. 12 ల‌క్ష‌లు

నెల్లూరు – రూ. 4 ల‌క్ష‌లు

త‌మిళ‌నాట రూ. 65 ల‌క్ష‌లు, క‌ర్ణాట‌క‌+ రెస్టాఫ్ ఇండియా రూ. 75ల‌క్ష‌లు, ఓవ‌ర్ సీస్‌లో రూ.2కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.