జైశ్వాల్‌ ట్రోఫి రెండు ముక్కలైంది..!

yashasvi jaiswal
yashasvi jaiswal

ముంబయి: భారత యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌ మాత్రం ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో తనకు వచ్చిన అవార్డును రెండు ముక్కలు చేసాడు. అండర్‌ -19 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో గత ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. ట్రోఫి చేజారినా భారత ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్‌ ఒక సెంచరీ, నాలుగు హాఫ్‌ సెంచరీలతో మొత్తం 400 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. టోర్నిలో టాప్‌ స్కోరర్‌గా జైశ్వాల్‌ నిలవగా..అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు లభించింది. టోర్ని అసాంతం అద్భుత ప్రదర్శనా చేసినా..బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిపోవడంతో యశస్వి జైశ్వాల్‌ చాలా నిరాశకి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకి లభించిన ట్రోఫిని అతను పగలగొట్టినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చాక చూస్తే అతడి ట్రోఫి రెండు ముక్కలై కనిపిందట.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/