జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

yarlagadda laxmiprasad
yarlagadda laxmiprasad

విశాఖపట్నం: తెలుగు భాష అభివృద్ధికి జగన్‌ కృషిని అభినందిస్తున్నామని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రతి పాఠశాలలో తెలుగు తప్పనిసరి చేస్తూ సియం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి మాజీ సియం చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. తెలుగు వర్సిటీ, తెలుగు అకాడమీ విభజనను వేగవంతం చేయాలని యార్లగడ్డ పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/