ఆ అధికారం ఎవరికీ లేదు

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతి: మండలి తీర్మానానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం ఎవరికీ లేదని టిడిపి నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఏపి ప్రభుత్వం అసెంబ్లీలో సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల ప్రతిపాదనలు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనలను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న శాసన మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుతగులుతుందని ఆయన అన్నారు. అయితే మండలి తీర్మానానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం లేదని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా చైర్మన్‌ ఆదేశాలను పాటించకుంటే కార్యదర్శి బాధ్యుడవుతారని ఆయన హెచ్చరించారు. మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ధిక్కరించడం అధికారుల వల్ల కాదని స్పష్టం చేశారు. అలా వెళ్లే వారెకరైనా సభ తీసుకునే నిర్ణయానికి బాధ్యులవుతారని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/