సొంత కేసుల కోసమే జగన్‌ ఢిల్లీ పర్యటనలు

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

విజయవాడ: టిడిపి నేత యనమల రామకృష్ణుడు ఏపి సిఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ఢిల్లీకి వెళ్లేది తనపై ఉన్న కేసులను పరిష్యరించుకునేందుకేనని, ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తన సొంత కేసులు, కోర్టు హాజరు మినహాయింపులు, డిశ్చార్జ్‌ పిటిషన్ల గురించే అడుగుతున్నారని యనమల విమర్శించారు. అందుకే కేంద్ర హోంమంత్రి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. శిక్షపడే సమయం దగ్గర పడిందనే భయం ఆయనకు పట్టుకుందని, ఇప్పటికే మనీలాండరింగ్‌, ఫెమాపై ఈడి, సిబిఐ కేసుల్లో జగన్‌ పీకల్లోతు కూరుకుపోయారని యనమల ఎద్దేవా చేశారు. విచారణ వేగవంతం కావడంతో కోర్టు వాయిదాను ఎగ్గొట్టేందుకు ప్రతి శుక్రవారం ఎదో ఒక పర్యటన వంక పెడుతున్నారని ఆయన అన్నారు. గత మూడు శుక్రవారాలుగా కోర్టు కు హాజరు కాకుండా డుమ్మా కొట్టారని ఆయన విమర్శించారు. జరగబోయే కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయమని, వైఎస్‌ఆర్‌సిపి పాలనలోని వైఫల్యాలను ఎండగడతామని యనమల స్పష్టం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/