మంత్రి బొత్సకు ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తాం

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారయణ వ్యాఖ్యలపై టిడిపి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాజధానిని శ్మశానంతో పోల్చడం దారుణమన్నారు. ప్రజాదేవాలయం శాసనసభను, హైకోర్టును శ్మశానంతో పోల్చుతారా అని ప్రశ్నించారు. రాజధాని కోసం 29 గ్రామాలకు చెందిన ప్రజలు భూములు ఇస్తే రైతుల త్యాగాలను బొత్స అవహేళన చేయడం సరికాదన్నారు. సీఎం జగన్‌, మంత్రి బొత్స సత్యనారయణ ఎక్కడ కూర్చుంటున్నారని..శ్మశానంలో కుర్చోని పరిపాలన చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు అమరావతిని అభివృద్ధి చేయకపోగా చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్‌ నోటిసు ఇస్తామని అన్నారు. రాజధాని ప్రజలనే కాదు, యావత్‌ రాష్ట్ర ప్రజలను కూడా మంత్రి బొత్స అవమానించరన్నారు. మంత్రిగా ఉండే అర్హతను ఆయన కోల్పోయారని..బొత్సను వెంటనే మంత్రి పదవినుంచి బర్తరఫ్‌ చేయాలని యనమల డిమాండ్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/