కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో సీఎం జగన్‌ విఫలం

బడ్జెట్‌పై ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు స్పందిచడం లేదు

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని టిడిపి నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు రాబట్టడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదన్నారు. బడ్జెట్‌పై ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు. కేసులు, జైలు, భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు. ఇంకా పాత చరిత్రను తవ్వుతూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరబాద్‌ నుంచి వచ్చాం కనుకనే ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంపై నమ్మకంలేక కంపెనీలు వెనక్కి వెళ్లాయని, 15వ ఆర్థిక సంఘాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని యనమల విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/