ఈ ప్రభుత్వం హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

రాజమండ్రి: టిడిపి సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణ రాజమండ్రిలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం హయాంలో చేతినిండా పని దొరికి హాయిగా జీవితాలు వెల్లదీసుకున్న భవన నిర్మాణ కార్మికులను వీధిన పడేసిన ఘనత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానిదని విమర్శించారు. ‘అన్నమో రామచంద్రా’ అంటూ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రులు వాటిపై హేళనగా మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు. విపక్షాలపై విమర్శలు చేయడానికే మంత్రులు ఉన్నారన్నట్లు వారి వ్యవహార శైళి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. రాజధానికి సంబంధించి సింగపూర్‌ కన్సార్టియంను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/