బుగ్గన సింగపూర్ లో ఏపీ పరువు తీస్తున్నారు

తమ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

అమరావతి: ఏపి ఆర్థిక మంత్రి బుగ్గనపై టిడిపి నేత యనమల తీవ్రంగా మండిపడ్డారు. సింగపూర్ వెళ్లిన బుగ్గన ఏపీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి నిధులు లేవంటూ తమ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణే జరిగిందని యనమల తేల్చిచెప్పారు.

అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో ఆర్థిక కార్యకలాపాలను ముఖ్యమంత్రి జగన్ చావు దెబ్బ తీశారని యనమల విమర్శించారు. తన పాలనను ప్రజలు మెచ్చుకుంటారని జగన్ చెప్పడం హాస్యాస్పదమని యనమల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని యనమల హెచ్చరించారు. ‘జగన్ ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పారు. కానీ 100 రోజుల్లోనే ఇంతకన్నా చెడ్డ సీఎం లేరని నిరూపించుకున్నారు’ అని ఎద్దేవా చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/