ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సీఎం నిర్ణయాలు

yanamala-rama-krishnudu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులతో రాష్ట్రానికి తీవ్ర నష్టమే తప్ప లాభం లేదని టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అభివృధ్ది వికేంద్రీకరణను ఎవరు వ్యతిరేకించరని అన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ ఏపీలో ప్రగతి జరగకుండా విచ్ఛిన్నం చేసేలా కుట్ర పన్నారని యనమల ఆరోపించారు. రాష్ట్రంలో తుగ్లక్‌ పరిపాలన కొనసాగుతుందని దాని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని యనమల విమర్శించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సీఎం జగన్‌ నిర్ణయాలు ఉన్నాయన్నారు. జగన్‌ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. సీఎం ఏదైనా ఆదర్శ నిర్ణయం తీసుకునేటప్పుడు అభివృద్ధి చెందిన దేశాలను పరిగణనలోకి తీసుకోవాలి కానీ ఆయన వెనుకబడిన దేశాలను తీసుకుంటారా అని ప్రశ్నించారు. దక్షిణాఫ్రికా ఇతర దేశాలతో పోల్చితే వెనుకబడిన దేశమని తెలపారు. తాము అభివృద్ధి చెందిన సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటే..జగన్‌ మాత్రం ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. దీనిని బట్టి ఎవరి మైండ్‌ సెట్‌ ఎలా ఉందో తెసుస్తోందని యనమల ఎద్దేవా చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/