బొత్సపై యనమల ఘాటు వ్యాఖ్యలు

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

అమరావతి: రాజధాని అమరావతి విషయంలో తెరముందుకు వచ్చి మాట్లాడుతున్నది మంత్రి బొత్స సత్యనారాయణే అయినా వెనుక నుంచి మాట్లాడిస్తున్నది సిఎం జగన్‌ అని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి వెల్లడిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తే దాన్ని నాశనం చేయడానికి జగన్‌ కంకణం కట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు.
వైఎస్‌ఆర్‌సిపి నాయకుల తీరు చూస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి హైదరాబాద్‌ను ఆర్థికంగా పెంచడమే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో సాయపడిన టీఆర్‌ఎస్‌ రుణం తీర్చుకునే ఉద్దేశం ఇది అని ఆరోపించారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/