ఈ సారి కేంద్ర బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరపాలి

ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలనే జగన్‌ ధోరణి మంచిది కాదు

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

అమరావతి: టిడిపి నేత యనమల రామకృష్ణుడు ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన దాడులపై మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా పడినందున ఈ సారి కేంద్ర బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలనే జగన్‌ ధోరణి మంచిది కాదని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోందని, కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/