ఢిల్లీని వణికిస్తున్న యమున

Yamuna River
Yamuna River

ఢిల్లీని వణికిస్తున్న యమున 

ఢిల్లీ: ఢిల్లీలో యమునా నది పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం 204.83మీటర్ల స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం నాటికి వేయి కుటుం బాలను ఉత్తర ఢిల్లీ లోతట్టు ప్రాంతం నుండి తరలించి నట్లు ఉప ముఖ్యమంత్రి సిసోడియా మీడియాకు తెలిపారు. అక్షరధామం, పాండవ నగర్‌లోని లోతట్టు ప్రాంతాలనుండి ప్రజలను సరక్షిత ప్రాంతాని అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద తరలిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని లొతట్టు ప్రాంతాల ప్రజలలను ఎతైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని సూచించినట్లు సిసోడియా తెలిపారు. ఆదివారం ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది వరద తీరును బట్టి జులై31 నాటికి నీటి మట్టం 206.60 మీటర్లకు చేరవచ్చని సిసోడియా తెలిపారు. ఇది ప్రమాదకరమైన స్థాయి అని రాగా 72 గంటల పాటు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తతతో మెలగాలని అధికారులను ఆదేశించారు. ఎగువన ఉన్న హర్యాణా నుండి గత గరువారం భారీ స్థాయిలో నీటిని దిగువకు వదిలారు.