యాదాద్రి ఆలయానికి ఒకేరోజు రూ. 33లక్షల ఆదాయం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మామూలుగానే వీకెండ్ లలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.అలాంటిది మహాశివరాత్రి కావడం అలాగే ఆదివారం కావడం తో భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్‌, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. భక్తుల రాక వల్ల వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ. 33,09,574 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 2,97,400లు, సుప్రభాతం సేవల ద్వారా రూ. 18,500లు,పుష్కరిణీ ద్వారా రూ. 1,500లు,వ్రతాల వల్ల రూ. 1,41,600 లు , ప్రచార శాఖ ద్వారా రూ. 20వేలు, వీఐపీ దర్శనం ద్వారా లక్షా 80వేలు, యాదరుషి నిలయము ద్వారా రూ. 89,644,ప్రసాదవిక్రయం ద్వారా రూ. 17,15,750లు ఆదాయం వచ్చిందని వివరించారు. పాతగుట్ట ద్వారా రూ. 29,630లు,కళ్యాణ కట్ట ద్వారా రూ. 96,200లు,శాశ్వత పూజల ద్వారా రూ.15 వేలు, వాహన పూజలకు రూ. 24,700లు, కొండపైకి వాహన ప్రవేశాల వల్ల రూ. మూడు లక్షల 50వేలు ఆదాయం సమకూరిందన్నారు. అలాగే సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,01,632లు, వేద ఆశీర్వచనం ద్వారా రూ. 5,400లు,శివాలయం ద్వారా రూ. 37,896, అన్నదానము ద్వారా రూ. 2,322లు,బ్రేక్ దర్శనం ద్వారా రూ. 1,82,400లు ఆలయానికి ఆదాయ రూపేణా వచ్చిందని వెల్లడించారు.