మూడు రోజులపాటు యాదాద్రి నరసింహుని జయంతి ఉత్సవాలు

yadadri temple
yadadri temple

యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయంలో నేటినుంచి శ్రీ లక్ష్మీ నరసింహుని జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీవారు సాక్షాత్కారమైన ఘడియలను జయంతి మహోత్సవాలుగా అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. స్వామివారు వైశాఖ శుద్దచతుర్ధశి సంధ్యాసమయాన ఆవిర్భవించారు. అలాంటి మహిమాన్విత ఘడియలను గుర్తు చేసుకుంటూ పండుగ సంబురాలను జయంతి ఉత్సవాలుగా సకల భక్తజనుల కోలాహలంలో నిర్వహిస్తారు. ఈ రోజునుంచి 17 వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు అశేష భక్తజనం తరలివస్తున్నారు.
ఈ రోజు యాగశాల ప్రవేశం, స్వస్తివాచనము, పుణ్యాహవాచనము, విశ్వక్సేనారాధన, చతుర్వేద మూలమంత్ర, మూర్తి మంత్ర, జప పారాయణములు జరుగుతాయి. 16న గురువారం రెండోరోజు ఉదయం నిత్యహవనములు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపపారాయణములు, లక్ష కుంకుమార్చన, ప్రారంభమవుతాయ. రాత్రి హనుమంతవాహనంపై రామావతారం అలంకారసేవ నిర్వహిస్తారు. 17న శుక్రవారం ఉదయం నిత్యహవనము, నృసింహజయంతి, సహస్ర ఘటాభిషేకము, ఆరాధన , మహా పూర్ణాహుతి, నృసింహజయంతి సందర్భంగా ఉంటుంది. రాత్రి తీర్ధప్రసాద గోష్టి ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా మూడు రోజులపాటు భక్తులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి జయంతి ఉత్సవాల సందర్బంగా ఈ మూడు రోజులు శాశ్వత, నిత్య కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన హోమాలు నిర్వహించబడవు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/