వైభవంగా సాగుతున్న యదాద్రి బ్రహ్మోత్సవాలు

యదాద్రి: తెలంగాణకు మహా క్షేత్రమైన యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రెండో రోజు ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వాన మహోత్సవాలను ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చకులు నిర్వహించారు. ఉదయం బాలాలయంలో శ్రీ లక్ష్మీనరపింహుడిని ఉత్సవ అలంకారణ చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగమైన ధ్వజారోహణ మహోత్సవాన్ని నిర్వహించారు. మహోత్సవాలకు వచ్చే భక్తులకు స్వామి వారి అనుగ్రహం కలిగి ఉండేలా ముక్కోటి దేవతలను కోరుతూ గరుడ ముద్దలను అకాశానికి ఎగురవేస్తూ సాగిన మహోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు. కాగా ఈరోజు నుండి శ్రీవారిక బ్రహ్మోత్సవాల్లో అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో నిత్యహవన పారాయణాలు గావించి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఉదయం 11 గంటలకు మత్యావతార అలంకారసేవ, సాయంత్రం శేష వాహనశేవ పూజ కార్యక్రమాలను జరిపిస్తారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/