యాదాద్రిలో దైవ దర్శనాలు ప్రారంభం

యాదాద్రిలో దైవ దర్శనాలు ప్రారంభం
Yadadri gates to be open for devotees

యాదిద్రి: ఈరోజు నుండియాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దైవ దర్శనాలు ప్రారంభంకానున్నాయి. తొలి రోజు ఆలయ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకు అవకాశం కల్పించనున్నారు. రేపటి నుంచి అందరికీ దర్శనాలకు ఏర్పాట్లు చేయనున్నారు. మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. లడ్డు ప్రసాద కౌంటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయం లోపల తీర్థ ప్రసాదాలను నిషేధించారు. చిన్నపిల్లలు, వృద్ధులు దర్శనాలకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టుల తర్వాతే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/