రెండో విడత ‘వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ ప్రారంభం

YouTube video
 ”Y.S.R NETANNA NESTAM” Finacial Assistance by Hon’ble CM of AP from Tadepalli 

అమరావతి: ఏపి సిఎం జగన్‌ కరోనా నేపథ్యలో 6 నెలల ముందుగానే రెండో విడత ‘వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ పథకాన్ని శనివారం తాడిపల్లి క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులుంటే గ్రామ సచివాలయానికి వెళ్లి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేల నగదు పంపిణీ ద్వారా ఏపిలో మొత్తం 81,024 మంది చేనేతలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం మొత్తం రూ. 194.46 కోట్లు విడుదల చేసిందని వివరించారు. 13 నెలల కాలంలో చేనేత రంగానికి రూ. 600 కోట్లను కేటాయించిందని సిఎం వివరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/