కొత్త రెడ్‌మి ఫోన్‌పై రూ.200 రాయితీ

Redmi 7A phone
Redmi 7A phone


హైదరాబాద్‌: అత్యాధునికి ఫీచర్లతో మొబైల్స్‌ను విడుదల చేస్తున్న షామీ. తాజాగా మరో బడ్జెట్‌ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. రెడ్‌మి 7ఏ పేరుతో ఈరోజు భారత విపణిలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.5,799గా నిర్ణయించారు(జులై నెల మాత్రమే). జులై 11 నుంచి ఇది ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌లలో అందుబాటులోకి రానుంది. అయితే షామీ భారత్‌లో ప్రవేశించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఫోన్‌పై రూ.200 రాయితీ లభిస్తోంది. ఆ తర్వాత ఇవి వరుసగా రూ.5,999, రూ.6,199లకు లభించనున్నాయి.


రెడ్‌మి 7ఏ ప్రత్యేకతలు


* 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
* స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌
* 2జీబీ ర్యామ్‌+16జీబీ, 2జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
* ఎస్డీ కార్డు సాయంతో 256జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వెసులుబాటు
* 12 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/