ఓపెన్సేల్లో రెడ్మీ 7 స్మార్ట్ఫోన్

షియోమీ తన రెడ్మీ 7 స్మార్ట్ఫోన్ను గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ కేవలం ఫ్లాష్ సేల్లో మాత్రమే వినియోగదారులకు లభ్యమైంది. ఇక నుండి ఈ ఫోన్ను వినియోగదారులు ఓపెన్ సేల్లోనూ కొనుగోలు చేయవచ్చు. రూ.7,999 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభిస్తున్నది. రెడ్మీ 7 స్మార్ట్ఫోన్లో 6.2 ఇంచ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
మరిన్ని బిజినెసన్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/