టీ20 మ్యాచ్‌లో పోరాడి ఓడిన టీమిండియా……

the team india defeated in t20 match
the team India defeated in t20 match

బ్రిస్బేన్‌ : ఆస్ట్రేలియాతో ఇండియాకు జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది.174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 76 పరుగులు)దినేష్‌ కార్తీక్‌(13 బంతుల్లో 30 పరుగులు) పోరాడినా టీమ్‌కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా కృనాల్‌ పాండ్యా,దినేష్‌ కార్తీక్‌ వరుస బంతులో పెవిలియన్‌ చేరడం టీమ్‌ విజయావకాశాలను దెబ్బ తీసింది. బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ (7), కోహ్లి(4) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా,స్టాయినిస్‌ చేరో రెండు వికెట్లు తీసుకున్నారు. 4 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో 1-0ఆధిక్యం సంపాదించింది.