తండ్రితో కలిసి బిజెపిలో చేరిన రెజ్లర్‌ బబితా ఫొగట్‌

  • బిజెపిలోకి మహావీర్, బబితలకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు  
Babita Phogat joins BJP, her father
Babita Phogat joins BJP, her father

న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో ఫోగట్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్, ఆయన కుమార్తెలు గీత, బబిత, రీతూ, సంగీత ప్రముఖ రెజ్లర్లుగా పేరుపొందారు. దంగల్ సినిమాతో వారి విజయప్రస్థానం యావత్ భారతదేశానికి తెలిసింది. ఈ క్రమంలో బబితా ఫోగట్ తాజాగా రాజకీయాల్లో ప్రవేశించారు. తండ్రి మహావీర్ తో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఇప్పటివరకు హర్యానా స్టేట్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన బబిత తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/