‘వావ్.. గార్జియస్ బ్యూటీ’…

'వావ్.. గార్జియస్ బ్యూటీ'...
Sriya Saran new look

శ్రియ ఈమధ్య హైదరాబాద్ కు వచ్చింది.  సంతోషం సినీ అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొంది.  ఏమీ సందర్భంలేకపోతేనే కత్తిలాగా రెడీ అయ్యే ఈ భామ ఇలాంటి సందర్భం ఉంటే ఊరుకుంటుందా? ఒక డిజైనర్ డ్రెస్ లో గ్లామర్ ను ఒలికించింది.  ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ “సంతోషం అవార్డ్స్ కు హాజరయ్యాను. ఈ స్టన్నింగ్ గౌన్ డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ అనూష రెడ్డి. శ్రీదేవి మేడమ్ అవార్డు నాకు ఇచ్చారు. ఇది నాకో పెద్ద గౌరవం.  ఈ అవార్డును ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది.  ఎందుకంటేనే నేను ఎప్పటి నుంచో శ్రీదేవి మేడమ్ కు చాలా పెద్ద అభిమానిని.. ఎప్పటికీ ఆవిడ అభిమానినే.” అంటూ ఓ పొడవాటి క్యాప్షన్ ఇచ్చింది. 
క డ్రెస్ విషయానికి వస్తే లైట్ కలర్ లో ఉన్న ఎంబ్రాయిడరీ గౌన్ ధరించి వయ్యారంగా కూర్చుంది.  డీప్ వీ నెక్ తో అందాలను ఒడుపుగా వడ్డించింది. శ్రియ కూర్చున్న పోజు.. ఫేస్ లో ఆ స్మైల్ చూస్తే ఎవరైనా మాయలో పడిపోవాల్సిందే.
 అందుకే ఈ ఫోటోలకు సూపర్ కామెంట్లు పెట్టారు నెటిజన్లు.   “వావ్.. గార్జియస్ బ్యూటీ”.. “స్టన్నింగ్ కు స్పెల్లింగ్ శ్రియ”.. “క్యూట్ నెస్ + సెక్సీనెస్” అంటూ పొగడ్తలు కురిపించారు. 

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/