ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి మాకు చెబుతాడా

పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్‌

jogi ramesh
jogi ramesh

అమరావతి: రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేని పిచ్చి తుగ్లక్‌ మాకు చెబుతాడా? అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే జోగి రమేష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నయుడు హయంలో పవన్‌ కళ్యాణ్‌ నాలుగేళ్లు గోళ్లు గిల్లుకున్నారని..ముల్లు గుచ్చుకుంటే పారిపోయే వ్యక్తి పవన్‌ అని జోగి రమేష్‌ విమర్శించారు. రంగులు మార్చుకోవడానికి, సినిమాలలో వేషాలు వేసుకోవాడానికి పనికొస్తారే తప్ప రాజకీయాలకు పవన్‌ కళ్యాణ్‌ పనికిరాడని ఆయన దుయ్యబట్టారు. కాగా వైఎస్‌ఆర్‌సిపి పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలం గెలిచాం అవసరమైతే 152..158 గెలుస్తామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దే మా ముఖ్యమంత్రి జగన్‌ ధ్యేయం అని చెప్పారు. అమరావతి రాజధానిగా లేదని ఎవరైనా చెప్పారా? అంటూ జోగి రమేష్‌ ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని జోగి రమేష్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/