ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 57,89,571

మొత్తం మృతుల సంఖ్య 3,57,432

worldwide corona

కరోనా మహమ్మారి ప్రపంచంలోని 213 దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 లక్షల 89 వేల 571 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 34 వేల 521. కరోనా కారణంగా ఇప్పటివరు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 57 వేల 432 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి 24 లక్షల 97 వేల 618 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురైతుంది. కరోనా తో యూఎస్‌ఏ లో ఇప్పటి వరకు 1,02,107 మంది చనిపోయారు.

కరోనా కారణంగా వివిధ దేశాల్లో అత్యధికంగా సంభవించిన మరణాలు ఈ విధంగా ఉన్నాయి.

బ్రెజిల్‌25,697, రష్యా3,968, స్పెయిన్‌27,118, యూకే37,460, ఇటలీ33,072, ఫ్రాన్స్‌28,596, జర్మనీ8,533, టర్కీ4,431, ఇరాన్‌7,564, పెరూ3,983, కెనడా6,765, చైనా4,634, మెక్సికో8,597, పాకిస్థాన్‌1,225, బెల్జియం9,364, నెదర్లాండ్స్‌5,871, ఈక్వెడార్‌3,275, స్వీడన్‌4,220, పోర్చుగల్‌1,356, ఐర్లాండ్‌1,631, ఇండోనేషియా1,473, పోలాండ్‌1,028, రోమేనియాలో 1,227 మంది చనిపోయారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/