ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలు దాటిన కేసులు
మొత్తం మరణాలు 3,66,792

కరోనా మహమ్మారి పలు దేశాలల్లో తన పంజా విసురుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60 లక్షల 29 వేల 646 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 30 లక్షల 3 వేల 738. కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 66 వేల 792 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 26 లక్షల 59 వేల 116 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురైతుంది. కరోనాతో యూఎస్ఏ నిన్న ఒక్కరోజే 1,225 మరణాలు సంభవించాయి. వ్యాధి కారణంగా యూఎస్ లో ఇప్పటి వరకు మొత్తం 1,04,542 మంది చనిపోయారు. 17 లక్షల 93 వేల 530 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు.
పలు దేశాల్లో కరోనా మరణాలు..
బ్రెజిల్-27,944, రష్యా-4,374, స్పెయిన్-27,121, యూకే-38,161, ఇటలీ-33,229, ఫ్రాన్స్-28,714, జర్మనీ-8,594, టర్కీ-4,489, ఇరాన్-7,677, పెరూ-4,230, కెనడా-6,979, చైనా-4,634, మెక్సికో-9,415, పాకిస్థాన్-1,317, బెల్జియం-9,430, నెదర్లాండ్స్-5,931, ఈక్వెడార్-3,334, స్వీడన్-4,350, పోర్చుగల్-1,383, స్విర్జర్లాండ్-1,919, ఐర్లాండ్-1,645, ఇండోనేషియా-1,520, పోలాండ్-1,051, రోమేనియాలో -1,248 మంది మృతి చెందారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/