ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వరల్డ్‌ టాప్‌ పేయర్ల సందడి

rafael nadal & ashleigh barty
rafael nadal & ashleigh barty

మెల్‌బోర్న్‌: వచ్చే ఏడాది జరగబోయే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ స్టార్‌ ప్లేయర్లతో కళకళలాడనుంది. ఇటీవలే గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. కాగా ఈ జాబితాలో విక్టోరియా అజరెంకా మినహా పురుషులు, మహిళల విభాగంలో టాప్‌-50 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. అంతేకాకుండా ఈ టోర్నీలో ప్రధమ ఆకర్షణగా అగ్రస్థానంలో ఉన్న స్పెయిన్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్‌, మహిళల్లో ఆష్లే బార్టీ లు నిలువనున్నారని నిర్వాహకులు ప్రకటించారు. 38 ఏళ్ల స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తన కెరీర్‌లో ఏడవసారి ఈ ట్రోఫీని దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తన ఎనిమిదో గ్రాండ్‌ స్లామ్‌పై అంతే గురితో బరిలో దిగుతున్నాడు. ఇక ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్‌ తన కలను ఎలా నెరవేర్చుకుంటుందో వేచి చూడాలి. నొవోమి ఒసాకా(జపాన్‌), మాజీ ఛాంపియన్‌ కరోలిన్‌ వోజ్నియాకి వంటి ప్లేయర్లు ఈ టోర్నీలో సందడి చేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/