గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోకి వృద్ధ దంపతులు

John and Charlotte
John and Charlotte

హైదరాబాద్‌: ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దంపతులు. ఇటీవలే తమ 80వ పెళ్లి రోజును ఘనంగా జరుపుకొన్నారు. ఈ దంపతుల పేర్లు జాన్‌, కార్టొట్టె. జాన్‌ 1912, కార్లొట్టె 1914లో జన్మించారు. ఇద్దరికీ 1939 డిసెంబరు 22న వివాహం జరిగింది. వీరిని ప్రపంచంలోనే వృద్ధ దంపతులుగా (జీవించి ఉన్న) గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నవంబరులో గుర్తించింది. అయితే, దంపతులుగా అత్యధిక కాలం జీవిరచి రికార్డు, జెల్మీరా, హెర్బర్ట్‌ ఫిషర్‌ పేరిట ఉంది. వారు 86 సంవత్సరాల 290 రోజులు దంపతులుగా ఉన్నారు. హెర్బర్ట్‌ 2011లో చనిపోయారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/