స్పెయిన్‌ను ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చిన రఫెల్‌ నాదల్‌

Rafael Nadal
Rafael Nadal

హైదరాబాద్‌: వరల్డ్‌ నం.1 ఆట అంటే ఏమిటో అర్జెంటీనాకు స్పెయిన్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ రుచి చూపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన నాదల్‌ పురుషుల సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో సత్తాచాటి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. పదునైన సర్వీసులు, అద్భుతమైన ఫోర్‌, బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో రెచ్చిపోయిన రఫెల్‌ ప్రతిష్టాత్మక డేవిస్‌ కప్‌లో తన సొంతదేశం స్పెయిన్‌ను ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు చేర్చాడు. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో 2-1తో స్పెయిన్‌ విజయం సాధించింది. అంతకుముందు ఓ దశలో 0-1తో వెనకంజలో నిలిచిన జట్టును నాదల్‌ సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో అద్భుత విజయాలతో ముందుకు తీసుకెళ్లాడు. తొలుత జరిగిన సింగిల్స్‌లో 6-1, 6-2తో డేవిడ్‌ ష్వార్జ్‌మన్‌పై సునాయాసంగా విజయం సాధించాడు. అనంతరం పురుషుల డబుల్స్‌లో నాదల్‌-మార్సెలో గ్రానోల్లర్‌ జంట 6-4, 4-6, 6-3తో మాక్సిమో గొంజాలెజ్‌ః లియోనార్డో మయేర్‌పై అతి కష్టంగా విజయం సాధించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/