పర్యావరణ పరిరక్షణే భవిష్యత్తరాలకు రక్షణ

నేడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

World Environmental Protection Day

భారతదేశంలోని ప్రతి పౌరుడు కాలుష్యం నియంత్రణ, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రయత్నించాలి.

సంప్రదాయేతర ఇంధనాలను వినియోగించడం, ఘనవ్యర్థాల నిర్వహణకై ఆధునిక పద్ధతులను అవలంబించడం, ప్రజలలో అవగాహన కలిగించడం అందరి బాధ్యతగా గుర్తించాలి.

ఒక చెట్టును నరికే ముందు ఐదు మొక్కలు నాటడం, నీటిని పొదుపు చేయడం, రసాయనరహిత ఎరువ్ఞలతో వ్యవసాయం, ఘనవ్యర్థాలను ఎక్కువగా విడుదల చేయకుండా చేయడం, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ వాడకం తగ్గించడం వంటి విషయాలతో సమాజంలో అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది.

పర్యావరణంలో మనిషి దురాశ కాలుష్యానికి మూలకారణం. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలి, లాభాలు పొందాలి అనే ఆలోచన పర్యావర ణాన్ని చిధ్రం చేస్తుంది.

అది సమ స్యను సృష్టించడమేకాక తోటిజీవ్ఞల పట్ల వ్యతిరేక భావాలు మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం నేటి సమాజానికి ఎంతో అవసరం.

వీటి గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తం గా నిర్వహించే ప్రపంచ కార్యక్రమం ప్రపంచ పర్యావరణ దినోత్స వం. మొదటగా 1972,జూన్‌-5న స్టాక్‌హోమ్‌ స్వీడన్‌లో యుఎన్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించింది.

తరువాత 1974లో జూన్‌-5న ‘ఒకే భూమి అనే నినాదంతో మొదటగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపారు. 1987లో ప్రతి సంవత్సరం అతిథ్య దేశా లను మార్చడానికి సభ్య దేశాలలో ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం 143 దేశాలకు పైగా జరుపుకోవడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఈ దేశాలలో ప్రజలను ప్రభావితం చేయడానికి దీనిని ‘పీపుల్స్‌ డే అని పిలు స్తున్నారు.

ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్‌-5’జీవ వైవిధ్యం అనే నినాదంతో నిర్వహించాలని కొలంబియా దేశ పర్యా వరణ మంత్రి ‘రికార్డో లోజానో జర్మనీ ఎన్విరాన్మెంటల్‌ స్టేట్‌ సెక్రటరీ ‘జోచెన్‌ ప్లాస్పర్త్‌ యుఎన్‌ఇపి డైరెక్టర్‌, ‘ఇంగెర్‌ అండ ర్సన్‌ తెలిపారు.

భూగ్రహం జీవ వైవిధ్యంలో 10 శాతం ఈ దేశ సంపద అందుచేత ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవం నిర్వహించడానికి కొలంబియా ను అతిథి దేశంగా ప్రకటించారు. కొలంబియా పక్షులు, ఆర్చిడ్స్‌ జీవవైవిధ్యంలో మొదటిస్థానంలో ఉన్నాయి.

అలాగే ఈ దేశ సీతాకోకచిలకలు, సముద్రజీవ్ఞలు, మంచినీటి చేపలు, ఉభయ చరాలు, రెండవ స్థానంలో ఉన్నాయి. ప్రజలలో జీవవైవిధ్య అవగా హనలోపం వలన జీవవైవిధ్యాన్ని ఎక్కువగా కోల్పోతున్నాం. పర్యావరణ దినోత్సవ లక్ష్యాలు నెరవేర్చడానికి ప్రతి దేశం తనదైన శైలిలో ముందుకు సాగుతు న్నది.

ఉదాహరణకు అమెజాన్‌, ఆస్ట్రేలియా అడవ్ఞల్లో కార్చి చ్చులు, బ్రెజిల్‌ యునైటెడ్‌ స్టేట్స్‌లో పొదలు తగలబడిపోవడం వల్ల అనేక జీవజాతులు అగ్నికి ఆహుతి అయ్యాయి.

దీనికి ముఖ్యకారణం వాతావరణంలో గ్రీన్‌ హౌన్‌ వాయువ్ఞలు, ఎన్‌ఒఎఎ (నేషనల్‌ ఓపియానిక్‌ అండ్‌ అట్మా స్పెరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) నివేదికల ప్రకారం వాతావరణంలో సిఒ2 సాంద్రత 2019లో 414.14 పిపిఎమ్‌ ఉండగా 2020 జూన్‌ ఒకటి నాటికి 418.84 పిపిఎమ్‌గా నమోదైంది.

కానీ కరోనా లాక్‌డౌన్‌ వల్ల గంగానదితోపాటు అనేక నదుల నీటి స్వచ్ఛత పెరిగి పరి శుభ్రం అవ్ఞతున్నాయని సిపిసిబి (సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు) నివేదికలు తెలియచేస్తున్నాయి.

వాయుకాలుష్యం వలన ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏడు మిలియన్ల ప్రజలు చనిపోతున్నారు.

ముఖ్యంగా గుండెజబ్బులు,శ్వాస సంబంధ వ్యాధులు, కేన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా సంవత్సరానికి 4.2 మిలియన్ల మంది మరణిస్తున్నారని డబ్ల్యుహెచ్‌ఒ నివేదికలు తెలియచేస్తున్నాయి.

మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ సంవత్స రం ఫిబ్రవరి, మార్చి నెలలో వాయుకాలుష్యం అధికంగా నమోద వడానికి ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ వలన వాయుకాలుష్యం 70శాతం తగ్గిపోయింది.

దీనిద్వారా భారత ప్రభుత్వం సముద్రాలలో 2022 నాటికి 70శాతం ఘనవ్యర్థాలను,ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నది.అలాగే 2017 పర్యావరణ దినోత్సం ‘నేను ప్రకృతితో ఉన్నాను నినాదంతో అనేకవేల మొక్కలు నాటించారు.

నేడు ప్రతి ఒక్కరు ఈ నినాదం గుర్తుకుతెచ్చుకుని బాధ్యతగా ప్రవర్తించాలి. నేటి శాస్త్రసాంకతిక విజ్ఞానాలను అభివృద్ధి చేసుకుంటూనే పర్యా వరణంతో సమతుల్యాన్ని పాటించడమే ఈ శతాబ్దపు సవాల్‌గా మనం గుర్తించాలి.

ఆ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి విడుద లయ్యే వ్యర్థాలను తిరిగి ఉపయోగించడంచేయాలి.

తక్కువ నీటిని ఉపయోగించడం,3ఆర్‌ (రెడ్యూస్‌, రీయూస్‌, రీ సైకిల్‌),సూత్రాన్ని అనుసరించడం ద్వారా సహజవనరులను తర్వాతితరాలకు అందిం చవచ్చును.

ఈ పర్యావరణ పరిరక్షణ విధానాలను పాఠశాలల్లో అమలుచేస్తే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు చాలాఇష్టంగా, బాధ్యత గా పాల్గొంటారు.

సంప్రదాయే తర ఇంధనాలను వినియోగించడం, ఘనవ్యర్థాల నిర్వహణకై ఆధునిక పద్ధతులను అవలంబించడం, ప్రజలలో అవగాహన కలిగించడం అందరి బాధ్యతగా గుర్తించాలి.

అలాగే సమాజంలోని ప్రతి వ్యక్తి తన బాధ్యతగా గుర్తించి నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

  • డా.సుధాకర్‌ గుమ్మడి

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/