గాయం కారణంగా ఐపిఎల్‌కు జాదవ్ దూరం!

మొహాలి: ఐపిఎల్-2019 లీగ్ మ్యాచులో భాగంగా ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు కేదార్ జాదవ్ గాయపడ్డారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ బంతిని ఆపే క్రమంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. అతడు సౌకర్యంగా, నొప్పితో ఇబ్బందిపడుతున్నాడని చెన్నై హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరించాడు. జాదవ్ ప్లే ఆఫ్స్ ఆడే అవకాశాలు కన్నించట్లేదని మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. గాయం తీవ్రత దృష్ట్యా అతనికి విశ్రాంతి కల్పించాలని బిసిసిఐ భావిస్తున్నది. జాదవ్ ప్రపంచకప్ జట్టుకు ఎంపికైనందున అతడు కోలుకున్నా అతన్ని చెన్నై తరఫున ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/