విలియమ్సన్‌ మృదు స్వభావి: సచిన్‌

Sachin Tendulkar, Kane Williamson
Sachin Tendulkar, Kane Williamson


ముంబై: ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ నేపథ్యంలో సచిన్‌ మాట్లాడుతూ..నెమ్మదిగా ఉండడమే విలియమ్సన్‌కు ఆభరణమని పేర్కొన్నాడు. విలియమ్సన్‌కు అవార్డు ప్రధానం చేసే సమయంలోనూ తనకిదే మాట చెప్పానని తెలిపాడు.
మీ ఆటను అందరూ మెచ్చుకున్నారు. మీరు అత్యంత గొప్ప ప్రపంచకప్‌ ఆడారు అని విలియమ్సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందించే సమయంలో అతడికి చెప్పినట్లు సచిన్‌ తెలిపాడు. నెమ్మదిగా మసలుకోవడం కివీస్‌ సారథికి ఉన్న అతి పెద్ద స్వభావమన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను అతడు తన గుణాన్ని మరిచి ప్రవర్తించడని, దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌ గెలవలేకపోయాడని, ఆ బాధను తన ముఖంపై కనబడనీయకుండా అప్పుడు కూడా తన స్వభావాన్ని మరోమారు నిరూపించాడని తెలిపాడు. విలియమ్సన్‌ మ్యాచ్‌ను భిన్న కోణంలో చూస్తాడని సచిన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/