వరల్డ్‌ కార్‌ ఫ్రీ డే సందర్భంగా సీఎం కొత్త పథకం

చండీగఢ్: వరల్డ్‌ కార్‌ ఫ్రీ డే సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సైకిల్‌పై సందడి చేశారు. కాలుష్య నివారణపై అవగాహన కల్పించేలా తన మంత్రి వర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలతో సైకిల్‌యాత్రం చేపట్టారు. సీఎం ఇంటి నుంచి సెక్ర‌టేరియేట్ వ‌ర‌కు సైకిల్‌పై వెళ్లారు. వాస్త‌వానికి ర‌వాణా వ్య‌వ‌స్థ వ‌ల్ల వాయు, గాలి కాలుష్యం ఎక్కువ‌గా ఉంటోంది. ఆ కాలుష్యాల‌ను త‌గ్గించాలంటే, సైక్లింగ్ లేదా వాకింగ్ బెట‌ర్ అన్న సందేశాన్ని వినిపించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 75 సంవత్సరాల పైబడిన పాత చెట్ల నిర్వహణ నిమిత్తం, ప్రాణ వాయు దేవత పెన్షన్ యోజన పేరిట ఏడాదికి రూ. 2,500 పెన్షన్ అందజేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను ఈ పథకంలో చేర్చడం ద్వారా పరిరక్షణకు చర్యలు చేపడతా మన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న హరియాణా ఇక్కడ ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకురానుంది. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/