భారత్‌కు ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయం

కరోనా నేపథ్యంలో వంద కోట్ల డాలర్ల ఆర్థిక సాయం

world bank
world bank

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌కు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం ప్రకటించింది. సామాజిక భద్రత ప్యాకేజి కింద భారత్ కు 1 బిలియన్ డాలర్లు (రూ.7,549 కోట్లు) ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల కోసం ఈ నిధులు ఇస్తున్నట్టు ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రపంచబ్యాంకు భారత్ తో మూడు రంగాల్లో భాగస్వామిగా ఉండనుంది. ఆరోగ్యం, సామాజిక భద్రత, సూక్ష్మచిన్నమధ్య తరగతి పరిశ్రమల రంగంలో భారత్ కు దన్నుగా నిలవాలని బ్యాంకు భావిస్తోంది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ (భారత్) జునైద్ అహ్మద్ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/