భారత్ కు ప్రపంచబ్యాంకు ఆర్థికసాయం

రూ.3,640 కోట్ల ఆర్థికసాయం ప్రకటించిన ప్రపంచబ్యాంకు

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో సతమతమవుతున్న భారత్ కు ప్రపంచబ్యాంకు అండగా నిలిచింది. భారత్ కు నిధులు విడుదల చేయాలన్న ప్రతిపాదనకు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు సమ్మతించింది. ఈ మేరకు భారత్ కు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం అందించేందుకు మార్గం సుగమం అయింది. ఈ నిధులను భారత్ లోని ఎంఎస్ఎంఈ రంగం బలోపేతానికి ఖర్చు చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

2020 ఆరంభంలో భారత్ లో ప్రవేశించిన కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు ఎంఎస్ఎంఈ (చిన్న, మధ్య తరహా వ్యాపారాలు) రంగాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో 5.55 లక్షల వ్యాపార సంస్థలు ప్రభుత్వ సాయం పొందుతున్నాయి. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు ప్రపంచబ్యాంకు నిధులు ఊతమిస్తాయని భావిస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/