ఉక్రెయిన్ కు భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రపంచబ్యాంకు

గత రెండు వారాలుగా దాడులు
క్షీణించిన ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి
723 మిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీ ప్రకటన

World Bank announced a huge package to Ukraine

హైదరాబాద్ : యుద్ధం ఏ దేశానికైనా తీవ్ర ఆర్థిక నష్టం కలుగజేస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గత రెండు వారాలుగా రష్యా దాడులతో ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచబ్యాంకు నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఉక్రెయిన్ కు భారీ ఆర్థిక ప్యాకేజీతో ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించింది.

ఈ ప్యాకేజీ విలువ 723 మిలియన్ డాలర్లు. అందుకు ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ కు ఈ సాయం ఊరట కలిగించనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/